Advertisementt

మా ఎలక్షన్స్ పై చిరు సెన్సేషనల్ కామెంట్స్

Mon 09th Aug 2021 10:45 PM
hold elections,immediately,chiranjeevi,krishnam raju  మా ఎలక్షన్స్ పై చిరు సెన్సేషనల్ కామెంట్స్
Megastar Sensational comments on MAA ELections మా ఎలక్షన్స్ పై చిరు సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మా ఎలక్షన్స్ పై ఎట్టకేలకు చిరు నోరు విప్పారు. మా ఎన్నికల విషయంలో ఇప్పటివరకు మౌనం వహిస్తున్న మెగాస్టార్ తాజాగా మా ఎలక్షన్స్ విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం మా ఆపద్ధర్మ కార్యవర్గం సాయంతో నడుస్తోందని, త్వరలోనే ఎన్నికలు జరిపించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ఆలస్యం అయితే సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయని చిరు ఆందోళన వ్యక్తం చేస్తూ మా క్రమశిక్షణ కమిటి చైర్మన్ కృష్ణం రాజుకి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు, జీవిత - హేమ లు మా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరు మా ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేస్తారో అని అందరూ ఆశక్తిగా ఉన్న టైం లో నాగబాబు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చెయ్యడంతో చిరు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ఇక కృష్ణం రాజుకి లేఖ రాసిన చిరు అందులో.. కొత్త మా అధ్యక్షుడు, మా కార్యవర్గం ఎన్నికైతే పెండింగ్ పనులు వెంటనే పరిష్కరించుకోవచ్చు. బార్ ఎన్నికలు, ఇంకా మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో, మా ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించుకోవచ్చు. మీ మార్గదర్శకత్వంలో చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అంటూ కృష్ణం రాజు కి చిరు లేఖ రాసారు.

Megastar Sensational comments on MAA ELections:

Hold Elections Immediately: Chiranjeevi to Krishnam Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ