మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట నుండి బర్త్ డే బ్లాస్టర్ అంటూ మహేష్ ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వడమే కాదు.. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో మొదలు కాబోయే SSMB28 లో మహేష్ తో కలిసి నటించబోయే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా నటులు, మిగతా టెక్నీకల్ టీం ని ప్రకటించి ఫాన్స్ ని మరింతగా సర్ ప్రైజ్ చేసారు. అయినా ఫాన్స్ లో మరో ఆత్రుత. అది మహేష్ - రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ అప్ డేట్ ని ఎక్సపెక్ట్ చేసారు. కానీ రాజమౌళి సైడ్ నుండి ఆ న్యూస్ ఏం లేకపోయినా.. మహేష్ మాత్రం రాజమౌళితో చెయ్యబోయే మూవీపై స్పందించాడు.
రాజమౌళి - నా కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ వస్తే చూడాలని ఫాన్స్ తో పాటుగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మా కాంబో మూవీ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఆ ప్రాజెక్ట్ పై ఇప్పుడే ఏం బయటపెట్టలేను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఇది మరో బాహుబలి మాత్రం కాదు.. అంటూ మహేష్ - రాజమౌళి మూవీపై ఫాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ పెంచేశారు మహేష్. ఇక రాజమౌళి తో మహేష్ మూవీ అనగానే అందరూ మహేష్ ఓ రెండేళ్లు ఫాన్స్ కి కనబడరు అనుకున్నారు. కానీ ఇప్పుడు బాహుబలిలా ఐదేళ్ల సినిమా కాదంటూ ఫాన్స్ కి క్లారిటీ ఇచ్చారు మహేష్.