కరోనా తో పలు రాష్ట్రాల్లో ఇంకా లాక్ డౌన్ నిభందనలు నడుస్తున్నాయి. ఏపీలో నైట్ కర్ఫ్యూ.. నడుస్తుంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉన్నాయి. కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా రోజురోజుకి పెరుగుతుండడంతో.. అక్కడ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. అయితే కేరళలో కరోనా నిబంధనలు ఉల్లగించిన కారణంగా మలయాళ నటుడు మమ్ముట్టి పై పోలీస్ కేసు నమోదు అవడం హాట్ టాపిక్ గా మారింది.
కేవలం మాముట్టిపైనే కాదు మరో మూడొందలమందిపై కూడా కేరళ పోలీస్ లు కేసు నమోదు చేసారు. మమ్ముట్టి మరో నటుడు రమేశ్ పిషరోడీ కలిసి కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్కడ ఆ సీనియర్ హీరోలు రోబో సాంకేతికత ఆధారంగా కీళ్లమార్పిడి శస్త్రచికిత్స సేవలు ప్రారంభించారు. అయితే కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న టైం లో ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో స్థానికులు హాజరయ్యారని.. ఆస్పత్రి యాజమాన్యం కొవిడ్ నిబంధనలు పాటించడంలేదంటూ ఓ వ్యక్తి పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో.. కేరళ పోలీస్ లు మమ్ముట్టి అక్కడికి హాజరైన 300 మందిపై కేసు నమోదు చేసారు.