Advertisementt

మహేష్ నుండి మరో సర్ప్రైజ్

Mon 09th Aug 2021 05:28 PM
mahesh,trivikram,ssmb28,ssmb cast & crew,ssmb28 announcement,mahesh babu birthday special,mahesh - trivikram combo  మహేష్ నుండి మరో సర్ప్రైజ్
SSMB28 - Cast & Crew Announcement మహేష్ నుండి మరో సర్ప్రైజ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం సర్కారు వారి పాట నుండి బర్త్ డే బ్లాస్టర్ ని రిలీజ్ చేసి ఫాన్స్ కియా దిరిపోయే ట్రీట్ ఇచ్చింది టీం. ఇక తాజాగా ఆయన అప్ కమింగ్ మూవీపై కూడా మహేష్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చేసింది టీం. 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. దీనిని కొనసాగిస్తూ...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం యూనిట్. 

ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే... జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా  ఎ.ఎస్. ప్రకాష్  , ఛాయాగ్రాహకుడు గా మధీ, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార పూజాహెగ్డే మరోసారి జతకడుతున్నారు. 

చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత  ఈ సందర్భంగా తెలిపారు. 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ  భారీ చిత్రం, మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.  

SSMB28 - Cast & Crew Announcement:

Mahesh - Trivikram SSMB28 - Cast & Crew Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ