Advertisementt

సీనియర్ నటిని చంపేసిన సోషల్ మీడియా

Sun 08th Aug 2021 05:00 PM
sharada death rumors,rumors,urvashi sharada death,sarada  సీనియర్ నటిని చంపేసిన సోషల్ మీడియా
Rumors on Urvashi Sharada death సీనియర్ నటిని చంపేసిన సోషల్ మీడియా
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా విపరీత పోకడలతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గా చూపించడం, అలాగే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ గా మారిపోవడం చూస్తున్నాం. అలాగే కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియా ఓ సీనియర్ నటిని చంపేసింది. పాపం ఆ నటి హడావిడికి తాను బ్రతికే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆవిడే ఊర్వశి శారద. ఒకప్పుడు సీనియర్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుని.. సంక్రాంతి లాంటి సినిమాల్లో అమ్మగా మెప్పించిన శారద (76) చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అందరూ అవాక్కయ్యారు. 

అయితే ఆ వార్తలు శారద గారి దగ్గరకు చేరడంతో.. ఆవిడా తాను బ్రతికే ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. నేను బతికే ఉన్నాను.. మహా ప్రభో అంటూ అందరికి స్పష్టతనిచ్చారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది... రెస్ట్ తీసుకుంటున్నాను. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. కేవలం ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వైరల్ చెయ్యడం  చేయడం బాధాకరం... అంటూ ఊర్వశి శారద క్లారిటీ ఇచ్చారు. ఒక మనిషి బ్రతికుండగానే చంపెయ్యడం ఎంత బాధాకరమైన విషయం. అందుకే శారద గారు అంతలా ఫీలయ్యారు.

Rumors on Urvashi Sharada death:

Sharada Death Rumors: Rumors On Urvashi Sharada Death

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ