విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎక్కడన్నా కలిసి కనబడితే చాలు... వాళ్ళిద్దరి మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ రష్మిక ర్యాపొ అలా ఉంటుంది. అంటే తరుచూ కలవడం, ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం ఇలా వాళ్ళ మధ్యన స్నేహమనే అంటారు కానీ.. నెటిజెన్స్ మాత్రం వాళ్ళ మధ్యన ఏదో ఉందనేస్తారు. అయితే రష్మిక, విజయ్ దేవరకొండ లు ఎప్పటికప్పుడు మా మధ్యన ఏం లేదని చెబుతూనే ఉంటారు.
తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా తనకి ఎలాంటి సలహాలు ఇస్తాడో.. తమ మధ్యన ఎంతలాంటి స్నేహం ఉందొ చెప్పింది. ప్రసుతం పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ కెరీర్ తన కెరీర్ ఒకేసారి మొదలు అయ్యింది అని, ఈ ప్రయాణంలో విజయ్ దేవరకొండ తనకి గొప్ప స్నేహితుడుగా మారాడని.. ఏదైనా టాపిక్ మొదలు పెడితే.. తామిద్దరం ఎలాంటి భేషజాలు లేకుండా అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకుంటామని.. అంతే కాకుండా కెరీర్ విషయంలో విజయ్ సలహాలు కూడా తీసుకుంటానని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. అందుకేనేమో విజయ్ సలహాలతో రష్మిక ఇప్పుడు టాప్ చైర్ కి దగ్గరయ్యిందిగా అంటున్నారు నెటిజెన్స్.