ఫిబ్రవరి లో ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో మొదలైన ఆదిపురుష్ షూట్ సెకండ్ వేవ్ వలన ఆగినా.. మళ్ళీ ముంబై లో రెస్యూమ్ షూట్ మొదలు కావడము.. రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ మీద ప్రస్తుతంకొన్ని సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనటం లేదు. ఆయన సాలార్ షూట్ లో బిజీగా వున్నారు. అయితే ఆదిపురుష్ మొదలైన రెండు నెలలకే శ్రీరామ నవమి ఫెస్టివల్ సందర్భంగా ఆదిపురుష్ నుండి ప్రభాస్ రాముడి లుక్ రిలీజ్ చేయబోతున్నారని అన్నా.. అది జరగలేదు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ నుండి ట్రీట్ రెడీ అవుతుంది అని అంటున్నారు. సీత కేరెక్టర్ లో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుంది.
అయితే ఆదిపురుష్ నుండి పాత్రల పరిచయాలు జరగబోతున్నాయని.. అందులో ముందుగా సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదిపురుష్ నుండి విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కృతి సనన్ పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆదిపురుష్ ప్రమోషన్స్ ని సీతాదేవి ప్రమోషన్ మొదలు పెట్టాలని భావిస్తుందట చిత్ర యూనిట్. సో ఆదిపురుష్ ట్రీట్ కి అప్పుడే ప్రభాస్ ఫాన్స్ కూడా రెడీ అవుతున్నారు.