Advertisementt

పాగల్ తో విశ్వక్ కూడా వచ్చేస్తున్నాడు

Sat 07th Aug 2021 05:34 PM
vishwak sen,paagal movie,paagal releasing on august 14,vishwak sen pagal movie  పాగల్ తో విశ్వక్ కూడా వచ్చేస్తున్నాడు
Vishwak Sen Paagal Release date locked పాగల్ తో విశ్వక్ కూడా వచ్చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ యువ క‌థానాయ‌కుడి లేటెస్ట్ మూవీ పాగల్. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. శనివారం సినిమా రిలీజ్ డేట్‌కు అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విష్వక్ సేన్ కూల్ లుక్‌తో చేతిలో ఎర్రగులాబీని పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నాడు. వెనుక పోస్టర్‌లో మబ్బుల నుంచి లవ్ సింబల్ కనిపిస్తుంది. అంటే సినిమా ప్రేమకథా చిత్రమని పోస్టర్ తెలియజేస్తుంది.

ఇదొక అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌. నరేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాగల్ చిత్రంలో విష్వ‌క్ సేన్‌ స‌రికొత్త స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను పాగల్ సినిమాలో చేస్తున్నారు విష్వ‌క్‌సేన్‌.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ‘పాగల్’ రిలీజ్ డేట్ చాలా ద‌గ్గ‌రగా ఉంది. దీంతో మేక‌ర్స్ ఈ సినిమాకు భారీ ఎత్తున ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల‌ను ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా క‌నిపించ‌నున్నారు. 

Vishwak Sen Paagal Release date locked :

Vishwak Sen Paagal Releasing On August 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ