రాజమౌళి అండ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ టీం తో కలిసి ఆర్.ఆర్.ఆర్ ఆఖరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్లి.. అక్కడ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఐడి కార్డ్స్ వేసుకుని ఎన్టీఆర్ హడావిడి చేసాడు. ఇక ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ లో హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ తిరిగి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్యలో హైదరాబాద్ షూట్ లో పాల్గొన్న ఒలీవియా మోరీస్ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఉక్రెయిన్ షూట్ లో పాల్గొంటుంది.
అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో జాయిన్ అవడం, అందరిని కలుసుకోవడం హ్యాపీ గా ఉంది అంటుంది ఒలీవియా మోరీస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ని అక్టోబర్ 13 న రిలీజ్ చేసేందుకు రాజమౌళి చెయ్యాలని ప్రయత్నం లేదు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీ. ఇక ఉక్రెయిన్ షూట్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రధాన తారాగణం అంతా పాల్గోంటున్నారు.