ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని సినిమాల షూటింగ్స్ మొదలైపోయాయి. కానీ కరోనా మరోసారి ఉగ్రరూపం దాల్చేలా కనిపిస్తుంది. అయినప్పటికీ తగిన జాగ్రత్తలతో సినిమాల షూటింగ్స్ ని చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా టైం లో నా బిజీ షెడ్యూల్స్ వలన నా తల్లితండ్రులు చాలా కలత చెందుతున్నరంటుంది టాలీవుడ్ టాప్ రేస్ లో ఉన్న రష్మిక మందన్న. ఈ మద్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు వరస సినిమాల్తో దున్నేస్తూ యమా బిజీగా ఉంది.
బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు మరియు గుడ్‌బై సినిమాల షూటింగ్స్ తర్వాత హైదరాబాద్ కి బన్నీ పుష్ప కోసం, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్స్ కోసం వచ్చేసింది. అయితే కరోనా టైం లో ఇలా షూటింగ్స్ అంటూ తిరుగుతున్న తనని చూస్తే తన తల్లితండ్రులకి కాస్త భయంగా ఉంటుంది అని, కొన్ని రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేసుకోవడం మంచిది అని వారు సూచిస్తున్నారని.. అయితే నా ఆరోగ్యం పట్ల నా పేరెంట్స్ కలత చెందడం, వారి ప్రేమ నన్ను ఎమోషన్ కి గురి చేసినా సినిమా షూటింగ్స్ వాయిదా వెయ్యడం నా చేతుల్లో పని కాదు.. దర్శకనిర్మాతలు ఎలా అంటే అలా అంటుంది రష్మిక మందన్న. అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నాను అని చెబుతుంది ఈ బ్యూటీ.