ఈరోజు ఉదయం ఒక్కసారిగా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అంటూ నిహారిక భర్త చైతన్య పై న్యూసెన్స్ కేస్, నాగబాబు అల్లుడు చైతన్య జొన్నలగడ్డపై అపార్ట్మెంట్ వాసుల పోలీస్ కంప్లైంట్ అంటూ న్యూస్ రావడం, అది క్షణాల్లో వైరల్ అవడం చూసాం, మధ్యాన్నానికి.. కేసు కాంప్రమైజ్ అయ్యింది, అపార్ట్మెంట్ వాసులకి - చైతన్య కి పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చి.. కేసు కొట్టేశారంటూ వార్తలొచ్చాయి. అయితే తనపై న్యూసెన్స్ కేసు పెట్టిన విషయంపై నిహారిక హస్బెండ్ చైతన్య స్పందించారు.
అసలు తానే ముందు అపార్ట్మెంట్ వాసులపై న్యూసెన్స్ కేసు పెట్టగా.. మీడియాలో మాత్రం అపార్ట్మెంట్ వాళ్లే తనపై కేసు పెట్టినట్లుగా వార్తలొచ్చాయని, నేను ఆ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఆఫీస్ ఓపెన్ చెయ్యాలని అనుకున్నాను అని, ఆ విషయం ఫ్లాట్ ఓనర్ కి కూడా చెప్పాను అని, కానీ ఆ విషయమ్ ఆయన అపార్ట్మెంట్ వాసులకి చెప్పలేదని, దానితో విషయం తెలియని అపార్ట్మెంట్ వాసులు అర్ధరాత్రి వచ్చి తలుపులు బాదడంతో నేనే న్యూసెన్స్ కేసు పెట్టా అని, తర్వాత వాళ్ళు నాపై కేసు పెట్టారని, కేవలం ఫ్లాట్ ఓనర్ అపార్ట్మెంట్ వాసులకి చెప్పకపోవడంతోనే ఇదంతా జరిగింది అని, ఇక పోలీస్ స్టేషన్ లో అపార్ట్మెంట్ వాసులకు మాకు మధ్యన కాంప్రమైజ్ అయ్యింది అని, ఈ నెల 10 న ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాము అంటూ చైతన్య జొన్నలగడ్డ తనపై కేసు విషయంగా స్పందించారు.
అపార్ట్మెంట్ లో 20 నుండి 30 కుటుంబాలు ఉన్నాయని, వాళ్ళకి ఆఫీస్ వ్యవహారాలు నచ్చకే ఇదంతా జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. ఇక చైతన్య ఆ ఫ్లాట్ ని ఓ స్టార్ట్ అప్ కంపెనీ కోసమే అద్దెకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.