చాలామంది సెలబ్రిటీస్ హోదాని మెయింటింగ్ చేస్తూ.. కోట్లకి కోట్లు వెనకేసుకుంటూ కొన్ని విషయాల్లో చీప్ గా బెహేవ్ చేస్తుంటారు. ఈమధ్యన తమిళ నటులు తరుచు ఇలాంటి విషయాల్లోనే వార్తల్లోకొస్తున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరో విజయ్ ఓ కాస్ట్లీ కారుని విదేశాల నుండి దిగుమతి చేసుకుని దానికి దిగుమతి సుంకం చెల్లించకుండా కోర్టు లో చివాట్లు తిన్నాడు. తాజాగా హీరో ధనుష్ కి కూడా ఇలాంటి వ్యవహారంలోనే చెన్నై కోర్టు అక్షింతలు వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. చిన్నా చితక కూలిపనులు చేసుకునే వారే పన్నులు కడుతుంటే.. మీలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు.. పన్ను కట్టాల్సిందే అంటూ కోర్టు ధనుష్ చెప్పింది.
2015లో స్టార్ హీరో ధనుష్ చాలా విలువైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి తనకి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అంత కాస్ట్లీ కారుని కొనుక్కుని పన్ను మినహాయింపు అడగడం హాస్యాస్పదంగా ఉంది అని, కూలిపనులు చేసేవాడు కూడా తాను కొన్న వస్తువులకి పన్ను కడుతుంటే.. మీరు మాత్రం ఇలా ఎగ్గొట్టడం ఏమిటి అంటూ కోర్టు ధనుష్ కి అక్షింతలు వెయ్యడంతో.. తాను ఇప్పటికే 50 శాతం పన్ను కట్టేసానని.. మిగతాది ఆగష్టు లోపు చెల్లిస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీస్ అయ్యుండి.. ఒకరికి చెప్పే స్థానాల్లో ఉండి.. ఇలా మీరు చెప్పించుకోవడం ఏమిటో అంటూ నెటిజెన్స్ ధనుష్ ని ఆడేసుకుంటున్నారు.