Advertisementt

అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా?

Thu 05th Aug 2021 01:10 PM
allu arjun,vijay sethupathi,oh my kadavule remake  అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా?
Allu Arjun extended cameo in Oh My Kadavule remake? అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఇప్పడు పాన్ ఇండియా స్టార్. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ పుష్ప మూవీ తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఐదు భాషల్లో తెరకెక్కనున్న పుష్ప డిసెంబర్ లో క్రిష్ట్మస్ కి రిలీజ్ కాబోతుంది. అయితే అల్లు అర్జున్ తదుపరి మూవీని కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చెయ్యాల్సి ఉంది. కానీ కొరటాల ఎన్టీఆర్ 30 కి షిఫ్ట్ అవడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ పై ఉత్కంఠ మొదలైంది. పుష్ప తర్వాత కూడా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేసేలా కనిపిస్తున్నాడు. 

ఇలాంటి టైం లో అల్లు అర్జున్ తెలుగులో తెరకెక్కబోయే ఓ రీమేక్ లో నటిస్తాడా? కోలీవుడ్ లో మంచి హిట్ అయిన ఓ మై కాదవులే తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ మై కాదవులే రీమేక్ దర్శకనిర్మాతలు అల్లు అర్జున్ వెంటపడుతున్నారని టాక్. ఓ మై కాదవులేలో విజయ్‌సేతుపతి పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ మై కాదవులే దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. మరి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఇలా ఓ రీమేక్ లో మరో హీరోతో కలిసి కనిపించడానికి ఒప్పుకుంటాడా? అనేది పెద్ద సందేహం. 

Allu Arjun extended cameo in Oh My Kadavule remake?:

Allu Arjun to reprise Vijay Sethupathi role?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ