Advertisementt

భారత హాకీ జట్టుకు ప్రముఖుల ప్రశంశలు

Thu 05th Aug 2021 12:14 PM
indian hockey team,winning the bronze medal,tdp mla,nandamuri balakrishna  భారత హాకీ జట్టుకు ప్రముఖుల ప్రశంశలు
Celebrities Congratulate Indian Men Hockey Team భారత హాకీ జట్టుకు ప్రముఖుల ప్రశంశలు
Advertisement
Ads by CJ

ఇండియా కి 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీ క్రీడకు పతకం రావడం పట్ల పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పతకం సాధించిపెట్టి  దేశ ప్రతిష్టను చాటిచెప్పిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇండియాకి ఈ టోక్యో ఒలింపిక్స్ లో మూడు పథకాలు రాగా.. ఇప్పుడు హాకీ జట్టు మరో పథకాన్ని సాధించి పెట్టడంతో హాకీ అభిమానులే కాదు.. ఇండియా మొత్తం పులకించిపోతుంది. తాజాగా భారతదేశానికి హాకీ జట్టు కాంస్యం అందించడంపై నందమూరి బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేసారు. 

హాకీ జట్టు కఠోర శ్రమతోనే ఈ పతకం లభించింది. దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా వుంటాయి. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారు. ఒలంపిక్స్ లో ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.. అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. 

Celebrities Congratulate Indian Men Hockey Team:

Congratulations to the Indian hockey team for winning the bronze medal -TDP MLA Nandamuri Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ