Advertisementt

నాగబాబు అల్లుడిపై న్యూసెన్స్ కేసు

Thu 05th Aug 2021 10:00 AM
police complaint,against,niharika husband,chaitanya jonnalagadda,nagababu son in law,niharika husband chaitanya jonnalagadda  నాగబాబు అల్లుడిపై న్యూసెన్స్ కేసు
Police complaint against Nagababu son in law Chaitanya Jonnalagadda నాగబాబు అల్లుడిపై న్యూసెన్స్ కేసు
Advertisement
Ads by CJ

మెగా సీనియర్ హీరో నాగబాబు తన కూతురు నిహారికకు గుంటూరు కి చెందిన చైతన్య జొన్నలగడ్డతో గత ఏడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసారు. మెగా ఫ్యామిలీ, కొద్దిమంది చుట్టల మధ్యన అదిరిపోయేలా నిహారిక - చైతన్య జొన్నల గడ్డ పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు మెహిందీ ఫంక్షన్, సంగీత్ తోనూ హడవిడి చేసారు. ఇక పెళ్లయ్యాక నిహారిక భర్త చైతన్య తో చెయ్యని రచ్చ లేదు. మాల్దీవులలో హాని మూన్ చేసుకున్న ఈ జంట సెకండ్ వేవ్ తర్వాత పాండిచ్చేరి కి సెకండ్ హనీమూన్ ట్రిప్ వేశారు. నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేసే ఈజంట.. హైదరాబాద్ లోని బంజారా హిల్స్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు. 

అయితే నాగబాబు అల్లుడు చైతన్య పై ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. నిహారిక ఇంట్లో అర్ధరాత్రి వేళ పెద్ద రచ్చనే నడిచిందని తెలుస్తోంది. ఇంట్లో పెద్ద గొడవ జరగడంతో.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‏మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. అయితే చైతన్య కూడా అపార్ట్మెంట్ వాసులపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Police complaint against Nagababu son in law Chaitanya Jonnalagadda:

Police complaint against Niharika husband

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ