టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ప్రముఖుల ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నగాక మొన్న దేశానికీ కాంస్యం అందించిన సింధు.. నిన్ననే స్వదేశానికి విచ్చేసింది. తాజాగా భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ ఇండియా కి మరో కస్య పథకాన్ని అందించింది. ఒలింపిక్స్ లో కాంస్యం తీసుకొచ్చిన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు.
ఎప్పటికి ఇలాగే గొప్పగా ఆడుతూ.. యువ క్రీడామణులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు. అయితే బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడి పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చిన్‌చెన్‌పై విజయం సాధించి ఆమె కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. తద్వారా ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు. అంతకు ముందు విజేందర్ సింగ్, మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు.
దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను .. అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. లవ్లీనా పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది... అంటూ ఆమెని పొగిడారు పవన్.