మే నెలలో విడుదల కావాల్సిన సినిమాలు, జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్ మూవీస్ అన్ని రిలీజ్ పోస్ట్ పోన్ అవడం, మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ ఇస్తూ హడావిడి కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ జులై 30 నుండి జనవరి 2022 సంక్రాంతి కి ఫిక్స్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ కూడా సంక్రాంతి 2022 అని ఫిక్స్ చేసేసారు. అల్లు అర్జున్ పుష్ప ముందు నుండి అనుకున్నట్టుగానే డిసెంబర్ లో క్రిష్ట్మస్ ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు అందరి చూపు కన్నడ సంచలనం కెజిఎఫ్ చాప్టర్ 2 మీదే ఉంది. కెజిఎఫ్ తో సంచలనాలను సృష్టించిన యశ్ అండ్ ప్రశాంత్ నీల్ లు కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో అని ఫాన్స్ వెయిటింగ్.
ఫాన్స్ మాత్రమేనా కెజిఎఫ్ కోసం ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అసలైతే జులై 16 న రిలీజ్ అవ్వాల్సింది.. కోవిడ్ పరిస్థితుల కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక కెజిఎఫ్ 2 కూడా క్రిష్ట్మస్ ని ఖాయం చేసుకోబోతుంది అనే న్యూస్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ హడావిడిగా క్రిష్ట్మస్ సెలవలు మీద కచ్చిఫ్ వేసేశాడు. ఇప్పుడు కెజిఎఫ్ పుష్ప మీద పోటీకి దిగుతుందా? లేదంటే కెజిఎఫ్ సంక్రాంతి కి రిలీజ్ అంతుందా? కాదు వచ్చే ఏడాది సమ్మర్ కి వెళుతుందా? అనే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యింది. మరి కెజిఎఫ్ మేకర్స్ ఈ కెజిఎఫ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే ఓకె.. లేదంటే ఫాన్స్ అయోమయం మరింతగా పెరిగిపోయేలా ఉంది.