గత వారం అరెస్ట్ అయ్యి.. రిమాండ్ లో ఉన్న టిడిపి నేత దేవినేని ఉమా.. ప్రస్తుతం పోలీస్ రాజమండ్రి సెంట్రల్ జైలు ల్లో ఉన్నారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం దేవినేని ఉమ తన బలగంతో అడ్డుకోవడానికి అక్కడికి వెళ్లగా.. ఉమా హడావిడి వలన జి.కొండూరు ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయని చెబుతూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన లాయర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దేవినేని తరుపు లాయర్ ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఉమాకు బెయిల్ వచ్చింది.
అయితే దేవినేని ఉమపై ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని పోలీస్ లు పెట్టారని ఉమా తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్న కోర్టు చివరకు దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది.