Advertisementt

ఎన్టీఆర్ vs నాగార్జున?

Tue 03rd Aug 2021 09:58 PM
younger tiger ntr,evaru meelo koteeswarudu show,star maa,nagarjuna,bigg boss season 5  ఎన్టీఆర్ vs నాగార్జున?
Young Tiger NTR vs King Nagarjuna? ఎన్టీఆర్ vs నాగార్జున?
Advertisement
Ads by CJ

థియేటర్స్ దగ్గర స్టార్ హీరోలు పోటీ పడడం కామన్. కానీ బుల్లితెర మీద కూడా స్టార్ హీరోలు పోటీ పడితే.. ఏ ఛానల్ కి ఎక్కువ టిఆర్పి వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతుంది. స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కి హోస్ట్ గా చేసాడు. అప్పట్లో ఆ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక స్టార్ హీరోలు బుల్లితెర మీద ఏదో ఒక షో తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత బిగ్ బాస్ కి నాని, నాగార్జున వచ్చారు. ఇక జెమిని ఛానల్ లో చిరు, నాగ్, మీలో ఎవరు కోటీశ్వరులు షో చేసారు. 

ఇప్పుడు అదే షో ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే టైటిల్ తో జెమినిలో ఈ నెల 15 నుండి ఎన్టీఆర్ హోస్ట్ లో భీబత్సమైన క్రేజ్ తో ఆ గేమ్ షో మొదలు కాబోతుంది. ఇక స్టార్ మా లో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ కూడా ఇదే నెలలో మొదలు కాబోతుంది. మామూలుగానే టీఆర్పీ రేటింగ్ లో స్టార్ మా ముందుంటుంది. సీరియల్స్ అయినా, సినిమాలైనా ఫస్ట్ స్టార్ మా నే బెస్ట్ అనిపించేలా ఉంటుంది. ఆ తర్వాత జీ తెలుగు, ఈటివి, చివరిలో జెమినీ ఛానల్ ఉంటుంది. 

అయితే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఈ ఎవరు మీలో కోటీశ్వరులు షో చేయిస్తున్నారు జెమినీ వాళ్ళు. అంటే ఎన్టీఆర్ క్రేజ్ తో జెమినీ ఛానల్ మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. మరోపక్క బుల్లితెర మీద గిరాకీ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. పల్లెటూర్లలో బిగ్ బాస్ కి మంచి క్రేజ్ ఉంది. మరి ఎన్టీఆర్ షో, నాగ్ బిగ్ బాస్ షో ఒకేసారి ఒకే టైం లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రతి రోజు నైట్ 9. 30 కి ఈ రెండు షోస్ బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నాయని తెలుస్తుంది.

ఈలెక్కన ఎన్టీఆర్ క్రేజ్ vs నాగార్జున క్రేజ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ టీఆర్పీ రేటింగ్స్ తో ఎవరిది పై చెయ్యి అని అంచనా వేసేస్తారు. 

Young Tiger NTR vs King Nagarjuna?:

NTR Evaru Meelo Koteeswarudu vs Nagarjuna Bigg Boss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ