సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ అయిన అడివి శేష్.. తనకి అచ్చొచ్చిన జోనర్ ని వదలడం లేదు. కథాబలం ఉన్న సినిమాల్తో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ మేజర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో అడివి శేష్. ఈ సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తవగానే అడివి శేష్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం గూఢచారి సినిమా సీక్వెల్‌ను చేయబోతున్నారు. గూఢచారి సినిమా విడుదలై మంగళవారం(ఆగస్ట్3) నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నెలలోనే గూఢచారి సీక్వెల్‌కు సంబంధించిన ప్రకటనను చేయబోతున్నారు.
గూఢచారి మళ్లీ వస్తున్నాడు.. ఈ నెలలోనే ప్రకటన ఉంటుంది అంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు
ఈ రోజుతో గూఢచారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్టమైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్లలు చాలా ఇష్టపడి చూశారు. ఆగస్ట్ నెల నాకు బాగా కలిసొస్తుంది. ఈ నెలలోనే నా నెక్స్‌ట్ సినిమా G2(గూఢచారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వరలోనే తెలియజేస్తాను అంటూ అడివిశేష్ ట్వీట్ చేశారు.