Advertisementt

కొడుకు ఖాతాలో క్రెడిట్ వేసిన రాజమౌళి

Mon 30th Aug 2021 01:48 PM
rajamouli,rrr movie,rrr dosti song,credit to karthikeya,rajamouli son karthikeya,keeravani,dosti song  కొడుకు ఖాతాలో క్రెడిట్ వేసిన రాజమౌళి
RRR Dosti song credit goes to Karthikeya కొడుకు ఖాతాలో క్రెడిట్ వేసిన రాజమౌళి
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ అక్టోబర్ 13 న థియేటర్స్ లో దింపడానికి రాజమౌళి శాయశక్తులా కష్టపడుతున్నారు. ఆగష్టు 1 నుండి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో అంటే పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టేసారు. దోస్తీ సాంగ్ తో ఐదు భాషల ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. కీరవాణి మ్యూజిక్ అందించిన దోస్తీ సాంగ్ ని ఐదు భాషాల్లో ఐదుగురు యువ సింగర్స్ ఆలపించారు. దోస్తీ సాంగ్ ఫాన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాకుండా దోస్తీ సాంగ్ వీడియో కూడా ఫాన్స్ నిలవనియ్యడం లేదు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కనిపించడం అన్ని సాంగ్ కే హైలెట్ అనేలా ఉన్నాయి. 

ఈ సాంగ్ పెద్ద హిట్ అవడంతో అందరూ రాజమౌళి ని తెగ పొగిడేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఈ సాంగ్ క్రెడిట్ నాది కాదు.. మా అబ్బాయి కార్తికేయది అని చెబుతున్నారు. తాను ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉంటె.. మ్యూజిక్ వీడియో తీయాలనే ఐడియా కార్తికేయా కి వచ్చింది అని, సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణతో కలిసి కార్తీకేయానే దోస్తీ వీడియోని తెరకెక్కించాడని.. ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ కి తాను చాలా సంతోషపడ్డాను అని చెప్పిన జక్కన్న ఈ సాంగ్ క్రెడిట్ ని కొడుకు ఖాతాలో వేసాడు. అంతేకాక.. ఐదు భాషల్లో ఈ పాటను పాడిన గాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

RRR Dosti song credit goes to Karthikeya :

Rajamouli gives RRR Dosti song credit to him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ