కరోనా సెకండ్ వేవ్ ని దాటుకుని యంగ్ హీరోలు ఓటిటి నుండి వచ్చిన బడా ఆఫర్స్ ని కాదనుకుని.. థియేటర్స్ రిలీజ్ లకే మొగ్గు చూపి.. తమ సినిమాలని గత శుక్రవారం థియేటర్స్ నుండి రిలీజ్ చేసారు. అందులో సత్య దేవ్ తిమ్మరుసు, ఇష్క్ తో తేజ సజ్జ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి సంకోచించలేదు. కానీ సెకండ్ వేవ్ ప్రేక్షకులని, ప్రజలను మాములుగా భయపెట్టలేదు.
గత శుక్రవారం ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలకు ప్రేక్షకాదరణ కరువైంది. థియేటర్స్ దగ్గర యూత్ తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ కనిపించిన పాపాన పోలేదు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల టైం లో ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడడం జరిగేపనిలా కనిపించడం లేదు. ఇక శుక్ర, శని, ఆది వారాల్లో పల్చగా ఉన్న ప్రేక్షకులు నేడు సోమవారం మరీ కానరాకుండా ఉన్నారు.
అందులోను మండే వర్కింగ్ డే ఒకటి. ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర సందడి చేసిందే లేదు. చాలామంది పనులు లేక ఖాళీగా ఉన్నవారికి సినిమా చూడడానికి కూడా డబ్బులేని పరిస్థితి. ఓటిటి లో ఎవరో ఒకరి యూసర్ మీద అయినా సినిమా చూసే వారు.. ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలంటె కాస్త కష్టమైన పనే.