Advertisementt

శిల్పా శెట్టి ఫస్ట్ టైం అలా..

Mon 02nd Aug 2021 04:36 PM
shilpa shetty,breaks silence,husband raj kundra arrest,shilpa shetty tweet  శిల్పా శెట్టి ఫస్ట్ టైం అలా..
Shilpa Shetty breaks silence on husband Raj Kundra arrest శిల్పా శెట్టి ఫస్ట్ టైం అలా..
Advertisement
Ads by CJ

రాజ్ కుంద్రా అరెస్ట్ తో నటి శిల్ప శెట్టి అవమాన పడింది. శిల్ప శెట్టి కూడా రాజ్ కుంద్రా చీకటి వ్యాపారంలో సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్ప శెట్టి ఇంటిని సోదా చెయ్యడం, ముంబై పోలీస్ లు శిల్ప శెట్టి ని ప్రశ్నించడం తో పాటుగా ఆమె బ్యాంకు ఖాతాలను సీజ్ చెయ్యడంతో శిల్ప శెట్టి పై అనుమానాలు మొదలయ్యాయి. భర్త అరెస్ట్ తర్వాత మీడియా తనని వేధిస్తుంది అంటూ కోర్టుకెక్కిన శిల్పా శెట్టి.. రాజ్ కుంద్రా అరెస్ట్ పై నోరు మెదపలేదు. తాజాగా శిల్పా శెట్టి ట్విట్టర్ వేదికగా భర్త అరెస్ట్ పై నోరు విప్పింది. 

అసలు విషయాలు తెలియకుండా పుకార్లు సృష్టించవద్దని, భారత న్యాయ వ్యవస్థపై, ముంబై పోలీస్ లపై తనకి నమ్మకం ఉంది అని, గత కొన్ని రోజులుగా తాను చాలా సవాళ్ళని ఎదుర్కుంటున్నా అని, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు తాను స్పందించలేదని, రాజ్ కుంద్రా అరెస్ట్ పై ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను.. నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్న భాగంగా తానేమి మాట్లాడలేనని.. కానీ ఈ కేసుపై న్యూస్ రాసేముందు ఆలోచించమని, ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను.. ఏమైనా కథనాలు రాసేముందు అన్ని విషయాలు తెలుసుకుని రాయండి అంటూ శిల్ప శెట్టి ట్విట్టర్ వేదికగా భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ పై స్పందించింది. 

Shilpa Shetty breaks silence on husband Raj Kundra arrest:

Shilpa Shetty first tweet after Raj Kundra arrest 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ