ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ ముగించే పనిలో ఉన్నాడు. మరోపక్క కొరటాల శివ తో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీ కోసం రెడీ కాబోతున్నాడు. ఈలోపులో జెమిని ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి యంగ్ టైగర్ హోస్ట్ గా చేస్తున్నాడు. మరోపక్క దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. నాగార్జున తో బంగార్రాజు మూవీని ఈనెల 20 నుండి మొదలు పెట్టబోతున్నాడట. మరి ఈ లోపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్ అంటూ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చెయ్యడం లేదు. ఆయన బుల్లితెర మీద చెయ్యబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి కళ్యాణ్ కృష్ణ కొన్ని ప్రమోస్ ని డైరెక్ట్ చేశారట. ఇప్పటికే రిలీజ్ అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో రిలీజ్ చేసింది. ఇక ఈ షో కోసం కళ్యాణ్ కృష్ణ ఐదు ప్రోమోలని డిజైన్ చేసి వాటిని డైరెక్ట్ చేశారట. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎవరు మీలో కోటీశ్వరులకు సంబందించిన అన్ని ప్రోమోస్ తెరకెక్కాయట. ఇక ఈ షో కి సంబందించిన కొన్ని ఎపిసోడ్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారట. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగష్టు 15 నుండి బుల్లితెర ప్రేక్షకుల ముందు రానుంది.