Advertisementt

దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర

Mon 02nd Aug 2021 02:15 PM
conspiracy to assassinate devineni uma,devineni uma,ex mp harsha  దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర
Conspiracy to assassinate Devineni Uma దేవినేని ఉమాను హత్య చేసేందుకు కుట్ర
Advertisement
Ads by CJ

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా గత వారం అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి జైలులో ఉమా హత్యకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు టిడిపి నేతలు చేస్తున్నారు. ఇక ఉమని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చినప్పుడు జైలర్ డ్యూటీలో ఉన్నారని, సెలవులో ఉన్న సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయటం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వివక్ష చూపుతున్నారని విర్శించారు.

నీతిగా నిజాయితీగా పనిచేసిన రాజమంఢ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో దేవినేనిని హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారా..  అనే అనుమానం కలుగుతోందన్నారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు బదిలీ, దేవినేని హత్యకు కుట్రపై హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలని హర్షకుమార్ కోరారు. 

Conspiracy to assassinate Devineni Uma:

Ex MP Harsha Press meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ