Advertisementt

పుష్ప ఎక్కడా తగ్గట్లేదు

Mon 02nd Aug 2021 01:35 PM
allu arjun - pushpa,rashmika mandanna,allu arjun,pushpa movie,sukumar pushpa,fahad fasil,pushpa pan india film,bunny - sukku combo,allu arjun-sukumar combo,rashmika-allu arjun combo,fahad villain in pushpa,pushpa raj,fahad fasil vs allu arjun  పుష్ప ఎక్కడా తగ్గట్లేదు
Pushpa first single treat on August 13th పుష్ప ఎక్కడా తగ్గట్లేదు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో హై బడ్జెట్ తో తెరకెనున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం ఐదు భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లేకపోతే పుష్ప ఆగష్టు 13 న రిలీజ్ కి రెడీ అయ్యేది. ఇంకా షూటింగ్ చిత్రీకరణలో ఉన్న పుష్ప టీం లోని కొంతమంది డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో ప్రస్తుతం షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అయితే పుష్ప కి మ్యూజిక్ అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు. దేవిశ్రీ బర్త్ డే స్పెషల్ గా పుష్ప నుండి స్పెషల్ అప్ డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ అనుకున్నఆగస్టు 13న పుష్ప ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది టీం. 

పుష్ప లో దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్‌ దడ్లానీ హిందీ, విజయ్‌ ప్రకాశ్‌ కన్నడ, రాహుల్‌ నంబియార్‌ మలయాళం, శివమ్‌ తెలుగు, బెన్నీ తమిళం అనే ఐదుగురు ప్రముఖ సింగర్ పాడనున్నారు. ఆగష్టు 13 న విడుదల కాబోయే పుష్ప ఫస్ట్ సింగిల్ పై ఇలా దేవి శ్రీ పుట్టిన రోజు నాడు అప్ డేట్ ఇచ్చి ఆ సాంగ్ పై మరిన్ని అంచనాలు పెంచేసింది పుష్ప టీం. ఈ సినిమాలో అల్లు అర్జున్ విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. హీరోయిన్ రష్మిక మందన్న, కీ రోల్ లో అనసూయ భరద్వాజ్ నటిస్తుంది. 

Pushpa first single treat on August 13th:

Pushpa first single power to be out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ