Advertisementt

ఆగష్టు ఫస్ట్ వీక్ థియేటర్స్ చిత్రాలు

Mon 02nd Aug 2021 12:45 PM
august 2021,tollywood movies,release schedule,sr kalyanamandapam,mugguru monagallu,merise merise movies  ఆగష్టు ఫస్ట్ వీక్ థియేటర్స్ చిత్రాలు
August First Week Theater Release Films ఆగష్టు ఫస్ట్ వీక్ థియేటర్స్ చిత్రాలు
Advertisement
Ads by CJ

జులై 31 నుండి తెలంగాణ థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి మొదలైంది. ఏపీలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అన్నప్పటికీ.. అక్కడ థియేటర్స్ తెరిచే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జులై 30 న తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీస్  రిలీజ్ అవ్వగా.. ఇక ఈ వారం అంటే ఆగష్టు ఫస్ట్ వీక్ లో థియేటర్స్ రిలీజ్ అంటూ చాలా సినిమాలే లైన్ లోకొచ్చాయి. ఈ వారం ఆగష్టు 6 న థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోయేవి చిన్న సినిమాలే. అందులో SR కల్యాణ మండపం మాత్రమే కాస్త క్రేజ్ ఉన్న సినిమా. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్ కీ రోల్ పోషించారు. ఈ సినిమా ఆగష్టు 6 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఇక అదే రోజున కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మొనగాళ్లు కూడా రిలీజ్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. హస్వంత్‌ వంగ, నమ్రత దరేకర్‌, కల్యాణ్‌ గౌడ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు కూడా ఆగష్టు 6 నే డేట్ ఫిక్స్ చేసింది. దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం మెరిసే మెరిసే తో పాటుగా మానస్ హీరోగా తెరకెక్కిన క్షీరసాగర మథనం కూడా ఆగష్టు 6 నే థియేటర్స్ నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక చాలా భాషల్లో చాలా సినిమాలు ఓటిటి నుండి కూడా ఈ వారం రిలీజ్ కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా మనోజ్ బజ్ పేయి.. డైలీ 100 కూడా ఉంది. 

August First Week Theater Release Films:

August 2021 Tollywood Movies Release Schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ