Advertisementt

బిగ్ బాస్ 5 కమింగ్ సూన్

Sun 01st Aug 2021 01:55 PM
bigg boss season 5,bigg boss telugu,big boss 5,star ma,big boss logo  బిగ్ బాస్ 5 కమింగ్ సూన్
Bigg Boss season 5 coming soon బిగ్ బాస్ 5 కమింగ్ సూన్
Advertisement
Ads by CJ

గత నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ ఈ ఏడాది మే, జూన్ లలోనే మొదలు కాబోతుందనే ప్రచారం జరిగినా కరోనా సెకండ్ వేవ్ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదటి సీజన్ పూర్తయినా.. సెకండ్ సీజన్ కి నాని, మూడు, నాలుగు సీజన్స్ కి నాగార్జునా హోస్ట్ లుగా చేసారు. ఇక సెప్టెంబర్ 5 నుండి సీజన్ 5 మొదలు కాబోతుంది అంటూ ప్రచారం జరగడం దానికి సంబందించిన కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో మోగిపోతున్నాయి. ఇక ఈ నెలలోనే లోగో లాంచ్, ప్రెస్ మీట్ ఉండబోతున్నాయనే అన్నారు. 

తాజాగా స్టార్ మా బిగ్ బాస్ లోగో లాంచ్ చెయ్యడం, బిగ్ బాస్ 5 కమింగ్ సూన్ అంటూ ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది. త్వరలోనే స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 5 మొదలు కాబోతున్నట్టుగా లోగో తో సహా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో ముందే కంటెస్టెంట్స్ సెలక్షన్స్ పూర్తిచేసి.. ఓ 15 రోజులు క్వారంటైన్ లో పెట్టి.. వాళ్ళని బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి హౌస్ లోకి పంపించబోతున్నారు. 

Bigg Boss season 5 coming soon :

Bigg Boss Telugu 5 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ