Advertisementt

బాబి - చిరు కథ అదేనా

Sun 01st Aug 2021 10:52 AM
director bobby,bobby birthday special,chiru - bobby movie  బాబి - చిరు కథ అదేనా
Director Bobby Birthday Special బాబి - చిరు కథ అదేనా
Advertisement
Ads by CJ

నేడు దర్శకుడు బాబి పుట్టిన రోజు. జై లవ కుశ తర్వాత బాబి భారీ గ్యాప్ తో మెగాస్టార్ చిరు తో ఓ మూవీ చెయ్యబోతున్నాడు. చిరంజీవికి కథ చెప్పి ఓకె చేయించుకున్నాక అందరి చూపు బాబి వైపే.. మొన్నీమధ్యనే చిరు గారు కథ ఓకె చేసారని, స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది అని, లూసిఫర్ రీమేక్ తో పాటుగా తన సినిమా కూడా పట్టాలెక్కబోతుంది అని చెప్పిన బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరు సినిమా కథకు స్ఫూర్తి ఏమిటో రివీల్ చేసేసాడు. అలాగే చిరు తో ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడో చెప్పకనే చెప్పాడు బాబి. 

చిరంజీవి గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కాస్త భయం వేసినా.. గంట స్టోరీ నేరేషన్ తర్వాత చిరు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అని, చిరు తో ఎలాంటి సినిమా చేస్తే ఫాన్స్ కి నచ్చుతుందో ఓ ఫాన్ గా అలాంటి కథే రాసుకున్నాను అని, ఓ అభిమానికి స్టార్ కి మధ్యన ఉండే అనుబంధమే ఈ కథకి స్ఫూర్తి. మొత్తంగా చెప్పాలంటే ఈ కథకు చిరంజీవే స్ఫూర్తి.. అని చెప్పిన బాబీ.. అభిమాన హీరోకి ఎలాంటి ఇంట్రడక్షన్ ఉండాలి, చిరు స్క్రీన్ ఎంట్రీ ఇవ్వగానే ఎలా విజిల్స్ కొట్టాలనిపిస్తుందో.. అలాంటి మూమెంట్స్ తోనే ఈ కథ సిద్ధం చేశాను. అవే రెండేళ్లుగా చాల సీరియస్ తో ఈ కథ సిద్ధం చేసేలా చేసాయి అంటూ తాను చిరు తో చెయ్యబోయే మూవీపై అందరిలో ఆత్రుత, ఆసక్తి పెరిగేలా చేసాడు బాబి. 

ఇక తాను చిరు తో చెయ్యబోయే మూవీ ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు రేంజ్లో ఉండబోతుంది అంటూ హింట్ కూడా ఇచ్చేసాడు బాబీ. చిరు తో మెగా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ.. నేడు బర్త్ డే జరుపుకుంటున్న డైరెక్టర్ బాబీ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.. 

Director Bobby Birthday Special :

Director Bobby about Chiru movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ