Advertisementt

పారితోషకంపై పూజ హెగ్డే సెన్సేషనల్ కామెంట్స్

Sat 31st Jul 2021 08:53 PM
pooja hegde,pooja supporting kareena kapoor,kareena kapoor,bollywood,pooja hegde sensational comments,remuneration  పారితోషకంపై పూజ హెగ్డే సెన్సేషనల్ కామెంట్స్
Pooja Hegde Sensational Comments on Remuneration పారితోషకంపై పూజ హెగ్డే సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలు సక్సెస్ లో ఉంటే పారితోషకం కింద కోట్లు అందుకుంటారు. ఇక నిర్మాతలు కూడా వాళ్ళ డేట్స్ దొరికితే చాలనుకుంటారు. కానీ హీరోయిన్స్ పారితోషకం డిమాండ్ చేసారంటే వాళ్ళని నెటిజెన్స్ ఆడుకుంటారు. తాజాగా టాలీవుడ్ లో కృతి శెట్టి పారితోషకం పెంచేసింది అనే న్యూస్ తో పాటుగా.. టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా 2నుండి 2.50 కోట్లు డిమాండ్ చేస్తుంది అని, అదే పాన్ ఇండియా ఫిలిం అయితే మరికాస్త ఉంటుంది అంటూ న్యూస్ లు ప్రచారం జరుగుతుంటాయి. ఇక రష్మిక అయితే కష్టానికి ఫలితం అడిగితె డిమాండ్ అంటారేమిటి అని నోరేసుకుపడిపోతుది. 

తాజాగా పూజ హెగ్డే కూడా ఈ పారితోషకం విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 

బాలీవుడ్ లో పెళ్ళై పిల్లలున్న హీరోయిన్ కరీనా కపూర్ ఓ సినిమాలో నటించడానికి గాను 12 కోట్లు డిమాండ్ చేసిందట. అది కూడా చారిత్రాత్మక చిత్రంలో సీత కేరెక్టర్ చెయ్యడానికి 12 కోట్లు అడిగిందట. దానితో నెటిజెన్స్ కరీనాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు కరీనాని బాలీవుడ్ నుండి బాయ్ కట్ చెయ్యాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు. కరీనాకి సీత కేరెక్టర్ చెయ్యడానికి 12 కోట్లు కావాలా అంటూ నెటిజెన్స్ ట్రోల్ చెయ్యగా.. ఆమెకి చాలామంది నటీమణులు మద్దతు తెలిపారు.

అందులో ముఖ్యంగా పూజ హెగ్డే రీసెంట్ గా కరీనా కపూర్ విషయం మాట్లాడుతూ.. ఆమెకి మర్కెట్ ఉంది కాబట్టే.. రెమ్యునరేషన్ అడిగింది. అసలు అలా అడగడంలో తప్పేముంది. అయినా హీరోయిన్లు పెద్ద మొత్తం డిమాండ్ చేసినప్పుడు గోల చేసేవాళ్లు.. హీరోలు డిమాండ్ చేస్తే ఎందుకు నోరు మెదపరు. అయినా రెమ్యూనరేషన్ అనేది నటుల హక్కు.. కానీ ఎంత ఇవ్వాలి అనేది నిర్మాత నిర్ణయం అంటూ పూజ హెగ్డే కరీనాని వెనకేసుకొచ్చింది. 

Pooja Hegde Sensational Comments on Remuneration:

Pooja Hegde supporting Kareena Kapoor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ