Advertisementt

పోలీస్ లపై నటి సెన్సేషనల్ కామెంట్స్

Sat 31st Jul 2021 08:07 PM
gehana vasisth,sensational remarks,raj kundra,mumbai police  పోలీస్ లపై నటి సెన్సేషనల్ కామెంట్స్
Actress Sensational Comments On Mumbai Police పోలీస్ లపై నటి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ముంబై లో బడా బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా బ్లు ఫిలిమ్స్ చిత్రీకరణ కేసులో పోలీస్ కష్టడీలో ఉన్నాడు. నటి శిల్పా శెట్టి  కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇక పలువురు నటీమణులు రాజ్ కుంద్రా పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి నాలుగు నెలలకు పైగా జైలులో ఉన్న గహన వసిష్ఠ.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉంది. రాజ్ కుంద్రా బ్లు ఫిలిమ్స్ చెయ్యలేదని, అవి కూడా వెబ్ సీరీస్ ల లాంటివే అంటూ మాట్లాడుతున్న గహన వసిష్ఠ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై పోలీస్ లపై సంచలన ఆరోపణలు చేసింది. 

నేను జైలులో ఉన్నప్పుడు నన్ను విడుదల  చెయ్యడానికి ముంబై పోలీస్ లు 15 లక్షలు అడిగారని, కానీ నేను తప్పు చేయలేదని పోలీస్ లతో వాదించినప్పుడు.. వారు మాత్రం తనని బెదిరిస్తూ మేము ఎవరిపైనైనా కేసు పెట్టవచ్చని వారు చెప్పినట్టుగా.. గహన ముంబై పోలీస్ లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రాజ్ కుంద్రా బావ యశ్ ఠాకూర్ ని కూడా పోలీస్ లు డిమాండ్ చేసారని.. అది వాట్స్ ఆప్ చాట్ లో ఉంది అంటూ గాహన ఆ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. 

ఇకమోడల్స్ ని బలవంతంగా బ్లు ఫిలిమ్స్ లో నటింపచేశారనే ఆరోపణలో గహన వసిష్ఠ ని అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ లు చెబుతుంటే.. గహన మాత్రం తనపై కేసు పెట్టిన ఆ మోడల్స్ రెండు మూడు అడల్ట్ వీడియోలలో నటించిందని.. చెప్పడం గమనార్హం.  

Actress Sensational Comments On Mumbai Police:

Gehana Vasisth Sensational remarks on Mumbai Police

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ