Advertisementt

నయన్ సైడ్ బిజినెస్

Sat 31st Jul 2021 01:51 PM
nayanthara,vignesh shivan,netrikan movie,nayan invests in chai waale,nayan and vignesh invests in chai waale  నయన్ సైడ్ బిజినెస్
Nayanthara and Vignesh invests in Chai Waale నయన్ సైడ్ బిజినెస్
Advertisement
Ads by CJ

నయనతార ఇప్పటికి చేతినిండా సినిమాలతో తన తరం హీరోయిన్స్ కి షాకిస్తూనే ఉంది. ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. నయనతార నటించిన లేటెస్ట్ ఫిలిం నేత్రికన్ మూవీ కరోనా  కారణంగా ఓటిటి కి అమ్మేసారు. నయన్ మూవీ హాట్ స్టార్ నుండి 13 ఆగష్టు న స్ట్రీమింగ్ కి రాబోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ మాత్రమే కాక ఇతర సినిమాలతో బిజీగా వున్న నయనతార మొదటిసారి ఓటిటి లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. నయనతార బాహుబలి వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. 

ఇక ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన నయనతార దాని నుండి సినిమాలు నిర్మిస్తుంది. 

తాజాగా నయనతార అండ్ ఆమె ప్రియుడు మరో సైడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లుగా టాక్. సినిమాలతో పాటుగా నయన్ అండ్ విగ్నేష్ లు బిజినెస్ మొదలు పెట్టబోతున్నారని  తెలుస్తుంది. అయితే అది డైరెక్ట్ గా కాకుండా చెన్నైకు చెందిన ఛాయ్ వాలే అనే ఛాయ్ వ్యాపారం చేసే కంపెనీలో ఈ జంట పెట్టుబడులు పెట్టారు. ఈ వ్యాపారంలో నయన్ తన ప్రియుడు విఘ్నేష్ కలిసి కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇలా ఈ క్యూట్ కపుల్ బిజినెస్ లోను అడుగుపెట్టేశారన్నమాట. 

Nayanthara and Vignesh invests in Chai Waale:

Nayan, Vignesh invest in Chai Waale

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ