రష్మిక డైరీ గురించి అందరికి తెలిసిందే. రష్మిక తాను రాసె డైరీ ని సీక్రెట్ గా దాచుకోక.. అందరికి తెలిసేలా షేర్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమా షూటింగ్స్ తో రష్మిక.. నైట్ మాత్రం డైరీ రాయకుండా ఉండలేకపోతుందట. రోజు తనేం చేస్తున్నానో ఆ విషయాలను రష్మిక క్లియర్ గా డైరీలో రాయడం.. దానిని అభిమానులకి షేర్ చెయ్యడం మాత్రం మరిచిపోవడం లేదు. ఇక పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో పాటుగా.. తెలుగులో శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షూటింగ్స్ కి హాజరవుతున్న రశ్మికకి నిన్న షూటింగ్ ఉన్నట్లుగా లేదు.
అందుకే.. తన డైరీ లో రష్మిక ఇలా రాసుకుంది. ఈరోజు పొద్దున్నే లేచాను.. బ్రేక్ ఫాస్ట్ తిన్నాను, టీవీ చూశాను, మళ్లీ లంచ్ తిన్నాను, తన పెట్ ఆరాతో ఆడుకున్నట్లుగా చెప్పిన.. రష్మిక ఆ తర్వాత కూడా డిన్నర్ తినేసి పడుకున్నాను అంటూ రాసుకొచ్చింది. ప్రతీ రోజూలానే ఈ రోజు కూడా చేసేశాను. నవ్వుకోవడానికి నాకు నేను చాలు. అయితే ఇంట్లో నేను ఒక్క దాన్నే ఉంటున్నా కూడా నా హెయిర్ బ్యాండ్ మిస్ అవుతూనే ఉంది. మరి అందరూ నాలాగే అంటే ప్రపంచంలోని అందరూ ఇలానే ఉంటారా అంటూ రశ్మిక్ డైరీ కబుర్లని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.