Advertisementt

అఫీషియల్: RC15 హీరోయిన్ ఫిక్స్

Sat 31st Jul 2021 10:40 AM
kiara advani,director shankar,ram charan,producer dil raju,rc15,next big ticket film  అఫీషియల్: RC15 హీరోయిన్ ఫిక్స్
Kiara Advani joins the stellar team of Director Shankar, Ram Charan for the next big ticket film! అఫీషియల్: RC15 హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో మొదలు కాబోతున్న పాన్ ఇండియా ఫిలిం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ని, డాన్స్ మాస్టర్ ని, డైలాగ్ రైటర్ ని ఎంపిక చేసిన టీం.. ఇప్పుడు రామ్ చరణ్ కి జోడిగా హీరోయిన్ ని కూడా ఎంపిక  చేసింది. ఎప్పటినుండో అనుకున్నదే.. కియారా అద్వానీని రామ్ చరణ్ కి జోడిగా RC15 లో నటించబోతుంది. 

టాలీవుడ్‌లో విన‌య విధేయ‌రామ‌, భ‌ర‌త్ అనే నేను చిత్రాల్లో న‌టించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇప్పుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. శ‌నివారం(జూలై 31) కియారా అద్వాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా...

కియారా అద్వాని మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు నా పుట్టిన‌రోజు వ‌చ్చిన గిఫ్ట్స్‌లో క‌చ్చితంగా ఇది బెస్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్‌.  చ‌ర‌ణ్‌, శంక‌ర్‌గారు, రాజుగారు, శిరీశ్‌గారు..ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో సినిమా చేస్తుండ‌టం నాకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అలాగే  నెర్వ‌స్‌గానూ అనిపిస్తుంది. చాలా గొప్ప అవ‌కాశం. షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు. 

Kiara Advani joins the stellar team of Director Shankar, Ram Charan for the next big ticket film!:

Kiara Advani joins the stellar team of Director Shankar, Ram Charan, and producer Dil Raju for the next big ticket film!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ