ఈటీవీలో గురు, శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లలో.. లేడి కమెడియన్స్ చాలా తక్కువ. ఎక్కువగా మగ కమెడియన్స్ మాత్రం లేడీ గెటప్స్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల గెటప్స్ లో జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. గెటప్ శ్రీను, సుధీర్, రామ్ ప్రసాద్, భాస్కర్ లాంటి వాళ్ళు అమ్మాయిల గెటప్స్ తో ఆకట్టుకున్నారు. ఇంకా సాయి, శాంతి స్వరూప్, మోహన్ లాంటి వాళ్ళు ఇప్పటికీ లేడి గెటప్స్ తో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా జబర్దస్త్ ని చూస్తున్నవారికి ఇక లేడీ గెటప్స్ కి కాలం చెల్లినట్టే అనిపిస్తుంది.
కారణం ఏం లేదు. హైపర్ ఆది లాంటి జబర్దస్త్ టీమ్ లీడర్స్ వారానికో అందమైన అమ్మాయిని తీసుకురావడం చేస్తున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా ఈమధ్యన యాంకర్స్, సీరియల్ ఆర్టిస్ట్ లని జబర్దస్త్ స్టేజ్ ఎక్కించేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ స్కిట్ తో వర్ష జబర్దస్త్ లో పాతుకుపోయింది. ఇక ఇప్పుడు భాను, సిరి, ఇంకా చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ లు జబర్దస్త్ స్టేజ్ మీద ఎక్కి గ్లామర్ తో అదరగోట్టేస్తుంటే ఇక అబ్బాయిలకు లేడీ గెటప్స్ వేసే అవసరం ఏముంటుంది. ఇలా వారానికో కొత్త అమ్మాయిని తీసుకొస్తే.. జబర్దస్త్ స్టేజ్ కళకళలాడిపోతుంది.