రానా - సాయి పల్లవి కాంబోలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం మూవీ సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. థియేటర్స్ బంద్ అవడంతో.. ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. మూడు నెలలుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో విరాట పర్వం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది అని, ఓటిటి నుండి భారీ డీల్ రావడంతో విరాట పర్వం మూవీని ఓటిటి నుండి విడుదల చెయ్యడానికి సురేష్ బాబు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు ఊతమిస్తూ సురేష్ బాబు కూడా మంచి డీల్ వస్తే విరాట పర్వం మూవీ ఓటిటికి అమ్మేస్తామని చెప్పడం, మధ్యలో విరాట పర్వం డైరెక్టర్ మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ చెప్పడంతో చాలామంది ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అయితే తాజాగా విరాట పర్వం మూవీపై మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది నెట్ ఫ్లిక్స్ తో విరాట పర్వం మేకర్స్ చేసుకున్న డీల్ రద్దు చేసుకుని.. విరాట పర్వం మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అవడంతో విరాట పర్వం మేకర్స్ ఈ సినిమాని ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడమెందుకు థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దామంటూ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.