Advertisementt

త్రిష పెళ్లిపై క్లారిటీ

Fri 30th Jul 2021 12:53 PM
trisha,trisha marriage,circulating on social media  త్రిష పెళ్లిపై క్లారిటీ
Trisha giving clarity on wedding news త్రిష పెళ్లిపై క్లారిటీ
Advertisement
Ads by CJ

గత వారం హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుంది.. ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో త్రిష ప్రేమలో పడింది, త్వరలోనే ఆ దర్శకుడిని త్రిష వివాహం చేసుకోబోతుంది అంటూ మీడియాలో కథాకథలుగా ప్రచారం జరిగింది. గతంలో చెన్నై వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష అతనితో నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకుని సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే తాజాగా త్రిష మళ్ళీ ప్రేమలో పడింది అని, కొన్నాళ్లుగా తమిళ దర్శకుడితో త్రిష ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలొచ్చాయి. 

అయితే తాజాగా త్రిష తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తానెవరిని ప్రేమించలేదని, తాను పెళ్లి చేసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పడమే కాదు.. త్రిష పిఆర్ టీం కూడా త్రిష పెళ్లి వార్తలను ఖండించింది. త్రిష ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉంది.. ప్రస్తుతం ఆమె ఫుల్ ఫోకస్ కెరీర్ మీదే.. ఆమె పెళ్లి చేసుకుంటే మేమె స్వయంగా చెబుతాము అంటూ త్రిష పిఆర్ టీం త్రిష పెళ్లిపై ఫుల్ క్లారిటీ  ఇచ్చేసింది. 

Trisha giving clarity on wedding news:

Trisha marriage has been circulating on social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ