Advertisementt

మీడియా కి షాకిచ్చిన శిల్పా శెట్టి

Fri 30th Jul 2021 12:06 PM
shilpa shetty,bombay high court,against,media,raj kundra,shilpa shetty husband raj kundra  మీడియా కి షాకిచ్చిన శిల్పా శెట్టి
Shilpa Shetty Approaches Bombay High Court Against Media మీడియా కి షాకిచ్చిన శిల్పా శెట్టి
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులు అంటే జులై 19 న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యింది మొదలు.. మీడియా లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ముంబై పోలీస్ లు అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పై అస్లీల చిత్రాల కేసు నమోదయ్యింది. ఇక కోర్టు కూడా రాజ్ కుంద్రా కి బెయిల్ ఇవ్వకుండా కష్టడిని పెంచుతూ వస్తుంది. రాజ్ కుంద్రా పై పలువురు నటీమణులు పోలీసులకి కంప్లైంట్ చెయ్యడం, శిల్ప శెట్టి ఇంటిని సోదా చెయ్యడం.. ఇవన్నీ మీడియాలో వస్తున్న వార్తలు నిమిషాల్లో పాకిపోతున్నాయి.  

అయితే మీడియాలో తనపై తన ఫ్యామిలీపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ శిల్పా శెట్టి ఫైర్ అవుతుంది. తన పై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ.. తమ పరువును దిగజారుస్తున్నారంటూ..  మీడియా సంస్థలపై  25 కోట్ల పరువు నష్టం దావా వేసింది శిల్పా శెట్టి. ఈ కేసును రేపు విచారించనున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. రాజ్ కుంద్రా అరెస్ట్ విషయాలను మీడియా తప్పుగా రిపోర్ట్ చేయడాన్ని ఆపాలని ఆ పిటిషన్ లో శిల్పా శెట్టి కోర్టును కోరింది. అయితే ఈ కేసులో లో గూగుల్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా ఆమె ఇన్వాల్వ్ చేశారని తెలుస్తోంది. 

Shilpa Shetty Approaches Bombay High Court Against Media:

Shilpa Shetty files defamation suit against 29 media houses

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ