నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి న్యూస్ ని హైలెట్ చేసింది. అక్కినేని సుమంత్ అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితమైన పవిత్ర అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, త్వరలోనే వాళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ న్యూస్ రావడమే కాదు.. పెళ్లి కార్డు ఒకటి హైలెట్ అయ్యింది. దానితో సుమంత్ రెండో పెళ్లి పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంతలోపులో కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ ఓ కాంట్రవర్సీ ట్వీట్ వేసాడు. ఆల్రెడీ ఓ పెళ్లి పెటాకులైంది.. మళ్ళీ పెళ్లేందుకు నీ ఖర్మ, పాపం పవిత్ర అంటూ ట్వీట్ చేసాడు.
అయితే తాజాగా సుమంత్ తన రెండో పెళ్లి వార్తలపై స్పందించాడు. తాను రెండో పెళ్లి చేసుకుంటున్నా అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా జస్ట్ రూమర్ అంటూ తన రెండో పెళ్లి ప్రచారాన్ని సుమంత్ ఖండించారు. తాను నటిస్తున్న ఓ సినిమా కి సంబందించిన పెళ్లి, విడాకులు కథతో సినిమా తెరకెక్కుతుంది అని, ఆ చితం సెట్స్ నుండి ఓ పెళ్లి కార్డు లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కానీ.. తాను నిజంగా రెండో పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు సుమంత్.