మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ లో దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సినిమా మొదలైనప్పటినుండే చిత్రయూనిట్ కూడా ఎగ్రెసివ్ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్ టైటిల్ రామారావు ఆన్ డ్యూటీ, ఈ సినిమా ఫస్ట్‌లుక్ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్భ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చిత్రయూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది. తన ఎనర్జీ, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో నటుడిగా మంచి ఆదరణ, గుర్తింపు తెచ్చుకున్న తొట్టెంపూడి వేణు.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటునాన్రు. అయితే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ఉన్న ఇంటెన్స్, ఆసక్తికరమైన అంశాలు ఆయన్ను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై తాను చేయని సరికొత్త క్యారెక్టర్‌ను రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో చేస్తున్నారు వేణు.