రాజ్ కుంద్రా-గహనాలపై మరో కేసు

Thu 29th Jul 2021 01:33 PM
fresh fir,raj kundra,pornography case,raj kundra and gehana vasisth,gehana vasisth  రాజ్ కుంద్రా-గహనాలపై మరో కేసు
Malwani Police registers a fresh FIR against Raj Kundra and Gehana Vasisth రాజ్ కుంద్రా-గహనాలపై మరో కేసు

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో పోలీస్ కష్టడీలో ఉన్నాడు. మరోపక్క శిల్పా శెట్టి కి కూడా ఈ కేసు లో ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే భార్య భర్తల బ్యాంకు అకౌంట్స్ ని సీజ్ చేసింది ముంబై పోలీస్ శాఖ. అయితే రాజ్ కుంద్రా కేసులో చాలామంది నటీమణులు ఫిర్యాదులతో రాజ్ కుంద్రా చుట్టూ ఈ కేసు మరింతగా బిగుసుకుంటుంది. తాజాగా మరో నటి రాజ్ కుంద్రా, ఈ యాప్ లో పనిచేసి రీసెంట్ గా జైలుకెళ్లిన నటీమణి గహనా వశిష్టాలపై కేసు పెట్టింది. ముంబై కి చెందిన ఓ నటి.. తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని అంటూ పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. 

ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ కేసులో గాహన వసిష్ఠ అరెస్ట్ అయ్యి ఐదు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయట ఉంది. ఇప్పుడు గహన పై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కేసు లో షాకింగ్ నిజాలు ముంబై పోలీస్ లకి తెలిసాయని ఈ కేసులో రాజ్ కుంద్రా కి జైలు శిక్ష తప్పేలా లేదు అని అంటున్నారు. 

Malwani Police registers a fresh FIR against Raj Kundra and Gehana Vasisth:

Fresh FIR against Raj Kundra in Pornography case