Advertisementt

ఉమాకే కాదు బాబుకి జైలు తప్పదు: నాని

Wed 28th Jul 2021 09:16 PM
kodali nani,comments,chandrababu,devineni uma,g konduru  ఉమాకే కాదు బాబుకి జైలు తప్పదు: నాని
Kodali Nani comments on chandrababu naidu and devineni uma ఉమాకే కాదు బాబుకి జైలు తప్పదు: నాని
Advertisement
Ads by CJ

మైలవరం టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమాని గత రాత్రి అరెస్ట్ చేసి నేడు కోర్టులో హాజరు పరచగా.. ఉమకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఉమా అరెస్ట్ తో ఏపీ మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని, దళితులు, పోలీసులను దేవినేని ఉమా ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని.. ఉద్దేశపూర్వంగానే వారిని రెచ్చగొట్టారని అందుకే గ్రామస్తులు తిరగబడాల్సి వచ్చిందని.. దానిలో భాగమే ఈ అరెస్ట్ అని అన్నారు నాని. . ఈ విషయాలేమీ ఎల్లో మీడియాకు పట్టవని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమా అనుచరులే వైఎస్సార్‌ సీపీ నేత కారు అద్దాలు పగలగొట్టారు. టీడీపీ నేతలు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలపై దాడి చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబు అని నాని మండిపడ్డారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా. అక్కడ జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. దీంట్లో ఉమా హయాంలో అక్కడ ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేస్తున్నాం. ఉమా అక్కడి కాంట్రాక్టర్లును డబ్బులకోసం బెదిరించాడు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఉమానే కాదు చంద్రబాబుని కూడా పోలీసు శాఖ వదలదు అంటూ మంత్రి కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడారు. 

Kodali Nani comments on chandrababu naidu and devineni uma:

Minister Kodali Nani serious comments on Chandrababu and Uma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ