నిన్న అర్ధరాత్రి హై డ్రామా మధ్యన టిడిపి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న దేవినేని ఉమా తనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వైసిపి శ్రేణులు, టిడిపి శ్రేణులు ఇరువర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమా అక్రమ మైనింగ్ చేశాడని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జి.కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
అరెస్ట్ అయిన దేవినేని ఉమని పోలీసులు ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.