బాలీవుడ్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ ఎన్ని ప్రకంపనలు రేపిందో కానీ.. ఇప్పుడు శిల్పా శెట్టి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఈకేసులో ఇంకా శిల్ప శెట్టి కి ముంబై పోలీస్ లు క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాజ్ కుంద్రా ఈ మెయిల్స్ లో బోలెడన్ని కీలక సాక్ష్యాలు లభించాయని, 16 పేజీల ఈమెయిల్‌లో అనేక విషయాలు బయటపడ్డాయి అని ముంబై పోలీస్ లు చెబుతున్నారు. ఈ మెయిల్స్ ద్వారానే రాజ్ కుంద్రా ఈ వ్యవహారాన్ని నడిపించారని, ఈ బిజినెస్ గురించి తనకి తెలియదని చెబుతున్న శిల్ప శెట్టి పై కూడా అనుమానం ఉంది అని, ఈ కేసులో శిల్ప శెట్టికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని ముంబై పోలీస్ లు చెబుతున్నారు.
త్వరలోనే మరోసారి శిల్పాశెట్టిని విచారించనున్నాం అని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు. ఆమె అకౌంట్లు, వివియాన్ ఇండస్ట్రీ నుంచి ఎంత మొత్తం ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిదనే విషయాలపై ఆరా తీస్తున్నాం అని అధికారులు తెలిపారు. అలాగే రాజ్ కుంద్రా బ్యాంకు అకౌంట్స్ అడిట్ చేస్తున్నామని, తెలిపారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కుటుంబ సభ్యులు పేర్లు బయటికి రావడం కలకలం సృష్టిస్తున్నాయి. యష్ థాకూర్, ప్రదీప్ బక్షి అనే రాజ్ కుంద్రా కుటుంబ సభ్యుడిలకి ఈ కుంభ కోణంలో సంబంధాలు ఉన్నాయి అని, రాజ్ కుంద్రా యష్ కలిసి చేసిన ఈమెయిల్ సంభాషణలు పోలీస్ లకి దొరకడమే కూండా.. యష్ థాకూర్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 6 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది.