రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలైపోయాయి. RoarofRRR మేకింగ్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్స్, అలియా భట్ సీత లుక్, మేకింగ్ వీడియోస్ తోనే సినిమాపై అంచనాలు క్రియేట్ చేసిన రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల్లో క్రేజ్ తేవాలంటే ఏమేం చెయ్యాలో.. ఎంత చెయ్యాలో అన్ని పక్కా ప్లానింగ్ లో ఉన్నారు.
ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ శాటిలైట్ హక్కులని సౌత్ మొత్తానికి స్టార్ నెట్వర్క్ కైవసం చేసుకోగా.. నార్త్ లో పెన్ స్టూడియోస్ వారు భారీ డీల్ కి ఎగరేసుకుపోయారు. ఇక సౌత్ శాటిలైట్ హక్కులకు ఆర్.ఆర్.ఆర్ నిర్మాతకి భారీ లాభాలొచ్చాని చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ మ్యూజిక్ హక్కులని సౌత్ నుండి లహరి మ్యూజిక్ సొంతం చేసుకోగా.. నార్త్ లో టి సిరీస్ సొంతం చేసుకున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించింది ఆర్.ఆర్.ఆర్ టీం. ఈ రెండు మ్యూజిక్ హక్కులు దాదాపుగా 25 కోట్లకి అముడిపోయినట్లుగా చెబుతున్నారు. అటు శాటిలైట్ హక్కులు, ఇటు మ్యూజిక్ రైట్స్, ఇక థియేటర్స్ రైట్స్ అన్ని కలిపి నిర్మాతకు బోలెడన్నిలాభాలు వస్తున్నాయని, ఇంకా మూడు నెలల రిలీజ్ కి టైం ఉన్న ఆర్.ఆర్.ఆర్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుంది.
వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ పై క్రేజ్ కలిగేలా రాజమౌళి పబ్లీసిటీ ని మొదలు పెట్టి.. అందరూ ఆర్.ఆర్.ఆర్ వైపే చూసేలా చెయ్యాలని డిసైడ్ అయ్యి రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.