Advertisementt

యాషిక ఆనంద్ లైసెన్స్ సీజ్

Mon 26th Jul 2021 08:53 PM
bigg boss fame,actress yashika aannand,driving licence,seized,chennai police  యాషిక ఆనంద్ లైసెన్స్ సీజ్
Yashika Anand Driving License Seized యాషిక ఆనంద్ లైసెన్స్ సీజ్
Advertisement
Ads by CJ

పాండిచ్చేరి నుంచి చెన్నైకి ఈస్ట్ కోస్ట్ రోడ్ మీదుగా ప్రయాణించే క్రమంలో మల్లాపురం సెంటర్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ తీవ్ర గాయాల పాలై చెన్నై ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. అయితే ఈ ప్రమాదంలో యషిక ఫ్రెండ్ మృతి చెందింది. కారు ప్రమాదం జరిగినప్పుడు యషికానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుంది అని, తన ఫ్రెండ్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలనే కారు నుండి ఎగిరిపడి మృతి చెందింది అని, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు యషిక మద్యం సేవించలేదని పోలీస్ ఇన్వెస్టుగేషన్ లో తేలినట్లుగా చెబుతున్నారు. 

అయితే కారు యాక్సిడెంట్ కి గురైనప్పుడు యషిక 120 స్పీడు తో కారుని నడిపినట్లుగా పోలీస్ లు గుర్తించారు. దానితో యాషిక ఆనంద్ డ్రైవింగ్ లైసెన్స్ ని పోలీస్ లు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక యషిక ఆనంద్ స్పృహలోకి వచ్చాక ఆమె వాంగ్మూలాన్ని పోలీస్ లు రికార్డు చేసారని, యషిక కి ఈ యాక్సిడెంట్ లో తుంటి, కాలు ఎముకలు విరిగి పోయినందున ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక యషిక  లైసెన్స్ సీజ్ చెయ్యడమే కాకుండా యాషిక ఆనంద్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైనందున, కేసు ముగిసే వరకు ఆమె వాహనాలు నడపకూడదనే ఉద్దేశంతో మహబలిపురం పోలీసులు యాషిక డ్రైవింగ్ లైసెన్స్‌ను జప్తు చేసినట్లుగా చెబుతున్నారు. 

Yashika Anand Driving License Seized:

Bigg Boss fame actress Yashika Aannand driving licence seized by Chennai police

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ