Advertisementt

చిరు153 సర్ప్రైజ్ త్వరలోనే

Mon 26th Jul 2021 06:22 PM
chiranjeevi,chiru 153,director mohan raja,lucifer remake,s.s. thaman,msuci director thaman,chiranjeevi -mohan raja combo  చిరు153 సర్ప్రైజ్ త్వరలోనే
Chiru 153 Surprise coming soon చిరు153 సర్ప్రైజ్ త్వరలోనే
Advertisement
Ads by CJ

చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో లూసిఫెర్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 12 నుండి మొదలు కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతము ఆచార్య కంప్లీట్ చేసే పనిలో ఉన్న చిరంజీవి.. వెంటనే లూసిఫెర్ రీమేక్ సెట్స్ కి షిఫ్ట్ అవుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. ఇప్పటికే థమన్ చిరు 153 కోసం పని చేస్తున్నాడు. తాజాగా సెల్వ రాజ్ చిరు 153 కోసం భారీ సెట్  నిర్మించడానికి రెడీ అయ్యారు కూడా. చిరు 153 షూటింగ్ కోసం అన్ని సిద్ధం అంటూ న్యూస్ వచ్చేసింది. 

అయితే చిరు 153 రెగ్యులర్ షూటింగ్ కి డేట్ ఫిక్స్ అవలేదని, ఈ ప్రాజెక్ట్ కోసం థమన్ మ్యూజిక్ స్టార్ట్ చేసాడని, త్వరలోనే చిరు 153 షూటింగ్ అప్ డేట్ ఇస్తామంటూ దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా ఫాన్స్ కి అప్ డేట్ ఇచ్చేసారు. దానితో మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్, ఆ వెంటనే బాబీ సినిమాతో మెగాస్టార్ చిరు బిజీ అవుతారని.. మెగాస్టార్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడానికి ఆచార్య రిలీజ్ డేట్ కావాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నారు మెగా ఫాన్స్. 

Chiru 153 Surprise coming soon:

Chiru 153 shooting up date coming soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ