పుష్ప పాన్ ఇండియా ఫిలిం రెస్యూమ్ షూట్ మొన్నీమధ్యనే సికింద్రాబాద్ లో మొదలయ్యింది. సెకండ్ వేవ్ ముందు వరకు సుకుమార్ పుష్ప షూటింగ్ ని పరిగెత్తించినా అల్లు అర్జున్ కరోనా బారిన పడడంతో షూటింగ్ కి బ్రేక్ వెయ్యకతప్పలేదు. ఇక సెకండ్ వేవ్ తగ్గాక పుష్ప షూటింగ్ ని మొదలు పెట్టిన టీం కి ఈసారి కరోనా షాకివ్వలేదు. డెంగ్యూ ఫీవర్ షాకిచ్చింది. పుష్ప షూటింగ్ మొదలు పెట్టిన కొద్దీ రోజులకే సుకుమార్ తో పాటుగా పుష్ప టీం లోని చాలామందికి డెంగ్యూ ఫీవర్ ఎటాక్ అయ్యిందట.
డాగ్ హౌస్ లో పుష్ప షూట్ రెస్యూమ్ ని మొదలు పెట్టిన సుకుమార్ అండ్ టీం కి వైరల్ ఫీవర్ రావడంతో.. అందరూ టెస్ట్స్ చేయించుకోగా.. పుష్ప టీంలో చాలామందికి డెంగ్యూ ఫీవర్ ఎటాక్ అయినట్లుగా తెలుస్తుంది. అక్కడ సెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా నీళ్లు నిల్వ ఉండడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఇలా టీం లో చాలామంది డెంగ్యూ బారిన పడినట్లుగా తెలుస్తుంది. సుకుమార్ కి కూడా కాస్త ఎక్కువగానే ఈ వైరల్ ఫీవర్ బారిన పడినట్లుగా సమాచారం. అయితే పుష్ప టీంలో అల్లు అర్జున్ తో పాటుగా హీరోయిన్ రష్మిక పాల్గొన్నప్పటికీ.. వీరిద్దరూ డెంగ్యూ నుండి తప్పించుకున్నారట. ప్రస్తుతం సుకుమార్ కూడా కోలుకున్నారని, అయితే బాగా నీరసంగా ఉండడంతో.. పుష్ప షూటింగ్ ని మొదలు పెట్టడానికి కాస్త టైం తీసుకునేలా ఉంది అంటున్నారు.