తమిళ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్.. ఇప్పుడు టాలీవుడ్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ లో భాగం కానున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి నిన్న చెన్నై వెళ్ల అనిరుద్ నే కాదు.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. కీరవాణి అనిరుద్ రవిచంద్రన్ ని కలిసింది మాత్రం ఆర్.ఆర్.ఆర్ లో అనిరుధ్ తో ఓ ప్రమోషనల్ సాంగ్ కోసమే అని తెలుస్తుంది. అంటే తమిళ ప్రేక్షకులకి అనిరుధ్ రవిచంద్రన్ అత్యంత ప్రియమైన మ్యూజిక్ డైరెక్టర్. స్టార్ హీరోల సినిమాలతో దూసుకుపోతున్న అనిరుధ్ తో తమిళంలో విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్ కోసం ఓ ప్రొమోషనల్ సాంగ్ ప్లాన్ చేసి ఇలా కీరవాణి అనిరుధ్ ని కలిసినట్టుగా తెలుస్తుంది.
ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. దీని కోసమే కీరవాణి చెన్నైకి వెళ్లినట్టు తెలుస్తోంది. కీరవాణి అనిరుధ్ ని కలిసిన తర్వాత ఆర్ఆర్ఆర్ గురించి అనిరుద్‌తో చర్చించాను.. ఎంతో చురుకైనా, ఎనర్జీ, ప్రతిభ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అనిరుష్ టీం అనిరుద్ కు బలం. వీటన్నంటికంటే.. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు అని కీరవాణి అనిరుష్ ని ఆకాశానికెత్తేశారు. ఇక కీరవాణి మీటింగ్ అయ్యాక ఆయన ట్వీట్ చూసిన అనిరుద్ ఆర్ఆర్ఆర్ కోసం పని చేయడం ఎంతో ఆనందం గా ఉంది అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం కీరవాణి, అనిరుద్ ల ఆర్.ఆర్.ఆర్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.