Advertisementt

చిరు డ్యూయెల్ రోల్.. ఏ సినిమాలో అంటే..

Wed 28th Jul 2021 11:17 AM
chiranjeevi,dual role,father and son character,bobby movie,vedalam remake,lucifer remake  చిరు డ్యూయెల్ రోల్.. ఏ సినిమాలో అంటే..
Chiranjeevi to play a dual role as Father and son character చిరు డ్యూయెల్ రోల్.. ఏ సినిమాలో అంటే..
Advertisement
Ads by CJ

చిరంజీవి కత్తి సినిమా రీమేక్ చేసి ఖైదీ నెంబర్ 150 తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 లో చిరు డ్యూయెల్ రోల్ లో నటించారు. ఇక తాజాగా మరో సినిమా లో చిరు డ్యూయెల్ రోల్ చెయ్యబోతున్నారని. ప్రస్తుతం ఆచార్య మూవీ చేస్తున్న చిరు.. త్వరలోనే లూసిఫెర్ రీమేక్ షూట్ లో పాల్గొనబోతున్నారు. మరి లూసిఫర్ రీమేక్ లో చిరు సింగిల్ గానే నటించాలి. కథని బట్టి చిరు డబుల్ రోల్ చేసే ఛాన్స్ లేదు. 

ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేయబోతున్న వేదాళం లో కూడా అజిత్ ఒక్క రోల్ లోనే కనిపించారు. అంటే చిరు కూడా వేదాళం రీమేక్ లో సింగిల్ గానే కనిపిస్తారు. మరి చిరు డ్యూయెల్ రోల్ చేయబోయేది ఏ సినిమాలో అంటే దర్శకుడు బాబీ తెరకెక్కించబోయే సినిమాలో. చిరు - బాబీ కాంబోలో లూసిఫర్ రీమేక్ తో పాటుగా ఓ మూవీ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో చిరు తండ్రి కొడుకులుగా నటించబోతున్నారని తెలుస్తుంది. మరి తండ్రి కొడుకులుగా చిరు ఎలా కనిపిస్తారో అనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు. చిరు స్క్రిప్ట్ ఫైనల్ చేసారని, త్వరలోనే సినిమా మొదలవుతుంది అని దర్శకుడు బాబీ ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

Chiranjeevi to play a dual role as Father and son character:

Chiru dual role in Bobby Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ